Friendship Moral Story In Telugu

Contact USA
2 min readMay 24, 2021

--

1). నిజమైన స్నేహితులు పంచతంత్ర కథ True Friendship moral story in Telugu

True Friendship Story In Telugu: ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక పావురం, ఎలుక మరియు జింక వున్నాయి, ఇవి మూడు మంచి స్నేహితులు. ఆ అడవిలో ఒక అందమైన సరస్సు వుంది, ఎలుక పావురం జింక ఆ సరస్సులోని నీరు తాగి అక్కడే జీవిస్తున్నాయి.

ఆ అడవిలో ఒక వేటగాడు వేటాడటానికి వచ్చాడు, అతడు జింకను పట్టుకోవడానికి ఒక వల వేశాడు. చాలా కృషితో ప్రయత్నించి, వేటగాడు విజయవంతంగా వలను జింకకు కనిపించకుండా దాచగలిగాడు. జింక సులభంగా వేటగాడి వలలో చిక్కుకుంది.

ఇది చూసిన పావురం, జింకతో “భయపడవద్దు మిత్రమా, వేటగాడు ఎక్కడ ఉన్నాడో, ఎంత దూరంలో ఉన్నాడో, నేను చూస్తాను” అంటుంది. మన స్నేహితుడు ఎలుక వలను కత్తిరించే వరకు నేను అతనిని ఆపుతాను. అప్పటివరకు నీవు త్వరగా వల నుండి తప్పించుకోవచ్చు.

పావురం అనుకుకున్నట్లు గానే వేటగాడి కోసం వెతకడం మొదలుపెట్టింది. అతను దూరంగా వున్నాడు, పావురం తన ప్రాణాలను పణంగా పెట్టి, వేటగాడిపై దాడి చేయడం ప్రారంభించింది, పావురం ఎందుకు దాడి చేస్తుందో వేటగాడికి అర్థం కాలేదు. పావురం దాడి చేస్తున్నప్పుడు అతనికి కొద్దిసేపు గందరగోళంగ అనిపించింది. కాని పావురం వేటగాడిని ఎక్కువసేపు ఆపలేకపోయింది.

వేటగాడు త్వరగా పావురాన్ని వదిలించుకొని తన వల వైపు వచ్చాడు. ఇక్కడ ఎలుక దాదాపు వలను కత్తిరించింది, ఇంకొద్ది సమయంలో జింకను విడిపించబోతోంది, అప్పుడే వేటగాడు అక్కడికి చేరుకున్నప్పుడు, పావురాల మంద త్వరగా వచ్చి వేటగాడిపై దాడి చేసాయి.

పావురాల గుంపు దాడి చేయడంతో వేటగాడు భయపడ్డాడు. ఆ పావురాల నుండి తప్పించుకోవడానికి కొంచెం సమయం పట్టింది. ఈ సమయంలో, ఎలుక వలను పూర్తిగా కోరికేసింది, జింక తప్పించుకుంది. ఇప్పుడు జింక మరియు ఎలుక పరుగెత్తాయి.కొంచెం దూరం వెళ్లినాక అవి వెనక్కి తిరిగి చూశాయి. పావురం వేటగాడి చేతిలో చిక్కడం చూశాయి.

జింక తన మనసులో “నా ప్రాణాన్ని కాపాడటానికి పావురం తన ప్రాణాలను పణంగా పెట్టింది. నేను పావురాన్నివిడిపించాలి”. అని అలోచించి, అప్పుడు జింక నెమ్మదిగా కుంటడం మొదలుపెట్టింది, “జింక కాలుకు గాయమైంది. కాబట్టి, జింక నెమ్మదిగా నడుస్తుంది, అది ఇక పరిగెత్తలేదు, సులభంగా పట్టుకోవచ్చు”. అని వేటగాడు అనుకున్నాడు.

వేటగాడు త్వరగా పావురాన్ని తన చేతి నుండి వదిలేసి జింక వైపు పరుగెత్తాడు. పావురం ఆకాశంలోకి ఎగిరిపోయింది. వేటగాడు రావడాన్ని చూసి, కుంటుతున్నట్లు నటిస్తున్న జింక కూడా వేగంగా అడవిలోకి పరిగెత్తింది. ఎలుక కూడా అక్కడినుండి తప్పించుకుంది.

ఆ విధంగా ముగ్గురు స్నేహితులు తమ తెలివితేటలను ఉపయోగించి ఒకరినొకరు రక్షించుకున్నారు.

ఇది కూడా చదవండి: మాట్లాడే గుహ The Talking Cave Moral Story In Telugu

Moral Of The Story (కథ యొక్క నీతి):

  • కష్ట సమయాల్లో మీకు సహాయం చేసే స్నేహితుడు నిజమైన స్నేహితుడు. ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయం చేయండి.
  • కలిసిమెలిసి, తెలివితేటలతో ఎవరైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవచ్చు.
  • క్లిష్ట పరిస్థితులలో మీ స్నేహితులపై నమ్మకం మరియు విశ్వాసం కలిగి ఉండటం చాలా ముఖ్యం.

Also, Read “30+ Best Panchatantra Stories In Telugu With Moral • పంచతంత్ర కథలు

Click For More Stories In Telugu With Moral

friendship-moral-story-in-telugu

--

--

Contact USA
Contact USA

No responses yet